విజయవాడలో మళ్లీ అదే ఘోరం.. యువతి బలి  - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో మళ్లీ అదే ఘోరం.. యువతి బలి 

October 15, 2020

nbmbvm

 విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవలే ప్రేమించడం లేదని యువతిని సజీవ దహనం చేసిన మర్చిపోకముందే బీటెక్ విద్యార్థినిపై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతిపై చినస్వామి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమకు నిరాకరించిందని కోపంతో ఇంటికి వెళ్లి హత్య చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలపాలైన ఆమె తీవ్ర రక్త స్రావంతో చనిపోయింది. క్రీస్తురాజుపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వరుస సంఘటనలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంజనీరింగ్ చదువుతున్న తేజస్విని పై కొంత కాలంగా చినస్వామి విద్యార్థిని ప్రేమ కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ వెంటనే తాను కూడా పొడుచుకున్నాడు. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఆస్పత్రికి తరలించగా.. యువతి చనిపోయింది. ప్రస్తుతం చినస్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.