ఇంద్రకీలాద్రిలో విరిగిపడిన కొండచరియలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంద్రకీలాద్రిలో విరిగిపడిన కొండచరియలు..

October 21, 2020

Vijayawada Indrakeeladri Hill

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. దుర్గ గుడి సమీపంలో మౌన స్వామి ఆలయం వద్ద చోటు చేసుకుంది. శిథిలాల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకొని ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. మరికాసేపట్లో సీఎం జగన్ వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ నుంచి చిన్న చిన్న రాళ్లు పడుతూ ఉన్నాయి. మూడు రోజులుగా పగళ్లు ఎక్కువగా ఏర్పడటంతో అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 

సీఎం పర్యటన నేపథ్యంలో భక్తుల కోసం వేసిన టెంట్ ప్రాంతంలో ఇది జరిగింది. గాయపడిన వారు శానిటైజేషన్ సిబ్బందిగా అధికారులు వెల్లడించారు. కాగా, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సరస్వతి అలంకరణ సందర్భంగా సీఎం వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. కాగా, ఇటీవలే దుర్గమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లై ఓవర్ పెచ్చులు మీద పడటంతో ఓ కానిస్టేబుల్ గాయపడిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలు అమ్మవారి దర్శనానికి వచ్చే వారిని కలవరపెడుతున్నాయి.