మరో ఘాటు ట్వీట్ చేసిన కేశినేని నాని - MicTv.in - Telugu News
mictv telugu

మరో ఘాటు ట్వీట్ చేసిన కేశినేని నాని

July 18, 2019

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓసారి ప్రభుత్వం, మరోసారి సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఘాటు ట్వీట్ చేశారు. అది ఎవరిని ఉద్దేశించి చేశారనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ తనకు దగ్గరగా ఉండి.. దూరమైన వ్యక్తుల గురించో.. తన గురించి తెలుసినవారి గురించో అని స్పష్టమవుతోంది.

“నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా.. నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు.” అంటూ ఓ ట్వీట్ చేసిన నాని.. ఆ వెంటనే ” ”ప్రబుద్ధుడు” తో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది.” అంటూ మరో ఘాటు ట్వీట్ చేశారు.