Vijayawada pocso court verdict sentence
mictv telugu

రేపిస్ట్‌కు మరణశిక్ష.. విజయవాడ కోర్టు తీర్పు..

August 10, 2022

Vijayawada pocso court verdict sentence

బాలుడిపై అత్యాచారం కేసులో విజయవాడలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అకృత్యానికి పాల్పడిన తిరుపతిరావును దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. బుధవారం కోర్టు 23 మంది సాక్షులతో కోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. దోషికి చనిపోయేవరకు మరణశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. .

కొండపల్లికి చెందిన ఆరేళ్ల బాలుడికి చాక్లెట్ల ఆశ చూపి తిరుపతి రావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. అభం శుభం ఎరుగని బాలికలతోపాటు బాలురపైనా అత్యాచారాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ మైలార్‌దేవ్ పల్లిలోని దారుల్ ఉలూమ్ మదర్సాలో షోయబ్ ఆక్తర్ అనే ఉపాధ్యాయుడు ఒక బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పదిరోజులుగా ఘోరానికి పాల్పడ్డంతో చిన్నారి అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతణ్ని అరెస్ట్ చేశారు.