పోలీసు కస్టడీలో దళిత యువకుడు మృతి.. విజయవాడలో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసు కస్టడీలో దళిత యువకుడు మృతి.. విజయవాడలో కలకలం

October 2, 2020

Vijayawada Police Custody

విజయవాడ పోలీసు కస్టడీలో దళిత యువకుడి మరణం కలకలం సృష్టించింది. మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు అయిన అజయ్ (26) ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. శ్వాస ఆడటం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. విచారణ సమయంలో ఈ సంఘటన జరగడంతో పోలీసులే కొట్టి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

కృష్ణలంక పెద్దివారి వీధికి చెందిన  అజయ్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నెల క్రితం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌  ఆర్టీసీ కార్గోలో వచ్చిన తెలంగాణ అతనికి ఓ పార్సిల్ వచ్చింది. చేపలకు ఆహారం వేసే బాక్సులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. గుప్తా అనే వ్యక్తి ఈ పార్శిల్‌ చేయగా దానిపై  ఫోన్ నంబర్ ఉండటంతో అతని కోసం వేట ప్రారంభించారు. ఇటీవల అజయ్, అతడి స్నేహితుడు సాయికిరణ్‌ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ కూడా జరిపారు. ఆ తర్వాత కొంత సేపటికే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. 

అయితే ఇది లాక్‌పడెత్‌ కాదని, అనారోగ్యంతోనే అజయ్‌ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. విచారణ సమయంలో చెమటలు పట్టి ఆందోళనకు గురయ్యాడని పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని తెలిపారు.. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.