కంచెకూ చెక్.. కోమట్లకూ చెక్! - MicTv.in - Telugu News
mictv telugu

కంచెకూ చెక్.. కోమట్లకూ చెక్!

October 25, 2017

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంతో పెను దుమారం రేపిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య బహిరంగ సభకు బ్రేక్ పడింది. ఆ సభను వ్యతిరేకిస్తూ ఆర్యవైశ్యులు కూడా పోటీగా నిర్వహించాలని తలపెట్టిన సభకూ చుక్కెదురైంది. ఈ నెల 28న విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించాల్సిన ఈ సభలకు అనుమతివ్వడానికి స్థానిక పోలీసులు నిరాకరించారు. సమస్యలు తలెత్తే అవకాశముంది కనుక అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

జింఖానా గ్రౌండ్స్ వద్ద నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఐలయ్యపై దాడి చేయడానికి వైశ్యులు ఇటీవల యత్నించిన నేపథ్యంలో సభల వల్ల  శాంతిభధ్రతలకు విఘాతం కలుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐలయ్య అభిమానులు, సామాజిక ఉద్యమ జేఏసీ నేతలు ఆయన మద్దతుగా సభ పెట్టాలనుకున్నారు. ఐలయ్య రాకను వ్యతిరేకిస్తూ ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ నేతలు కూడా అక్కడే సభ నిర్వహించాలని దరఖాస్తులు చేసుకున్నారు.