అమెరికాలో విజయవాడ యువకుడి మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో విజయవాడ యువకుడి మృతి 

December 2, 2019

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. అందులో ఓ వ్యక్తిని విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్‌గా గుర్తించారు. అతడి స్నేహితుడు జూడీ స్టాన్లీ పినీరియోతో కలిసి ప్రయాణిస్తున్న కారును ట్రక్కు వచ్చి ఢీ కొట్టడంతో వీరు మరణించారు. దక్షిణ నాష్‌విల్లేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  వైభవ్ టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. వైభవ్ రాసిన ఎన్నో వ్యాసాలు నాలుగు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైనట్టు వర్సిటీ అధికారులు గుర్తు చేసుకున్నారు. 

Vijayawada Studen.

ట్రక్కు ఢీ కొట్టగానే వాల్‌మార్ట్ ప్రాంగణంలోని చెట్టును ఢీకొంది. తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే ఇద్దరూ మరణించారు. ట్రక్కు డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఇది జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత  ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టోర్రెస్ వాహనం వదిలి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ మృతదేహాలను భారత్‌కు పంపించేందుకు వర్సిటీ విద్యార్థులు 42,000 డాలర్లు విరాళాలు సేకరించారు.