Vijayawada woman Nagamallika won the 'Miss Planet' title
mictv telugu

‘మిసెస్ ప్లానెట్’ గెలిచిన విజయవాడ వివాహిత.. ఘన స్వాగతం

July 21, 2022

ప్రపంచ వివాహితల సుందరి టైటిల్‌ను విజయవాడకు చెందిన వివాహిత బిల్లుపాటి నాగమల్లిక గెలుచుకున్నారు. బల్గేరియాలో జులై 6 నుంచి 15 వరకు ఈ పోటీలు జరుగగా, 60 దేశాల వివాహితలతో ఏడు రౌండ్లలో పోటీపడి మరీ నాగ మల్లిక టైటిల్ గెల్చుకుంది. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన నాగమల్లిక వ్యాపార వేత్త జితేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఏపీ, 2021లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు మిసెస్ ప్లానెట్ టైటిల్ గెలిచి అందాల పోటీల్లో తెలుగువారి ఖ్యాతిని పెంచారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రమయానికి చేరుకున్న నాగమల్లికకు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.