50లక్షల బ్యాగ్ ని దొరికిచ్చిన మూడో కన్ను..! - MicTv.in - Telugu News
mictv telugu

50లక్షల బ్యాగ్ ని దొరికిచ్చిన మూడో కన్ను..!

July 24, 2017

మూడో కన్ను తెరిస్తే..నిందితులు ఇట్టే దొరికిపోతున్నారు.సగం కేసును పూర్తి చేస్తుంది. మిగతా సగాన్ని నిఘా నేత్రం ఆధారంగా పోలీసులు కంప్లీట్ చేస్తున్నారు. విజయవాడలో పోయిన 50లక్షల క్యాష్ బ్యాగ్ ను పట్టించింది నిఘా నేత్రం.

విజయవాడ గవర్నర్‌పేటలో రూ. 50 నగదు బ్యాగ్ మాయమవడం కలకలం రేపింది. సంగ్వి జ్యువెలరీస్ గుమాస్తా రామకృష్ణ డబ్బు డిపాజిట్ చేయడం కోసం బైక్‌పై బ్యాంక్‌కు వెళ్తుండగా బ్యాగ్ కింద పడిపోయింది. ఇది చూసుకోకుండానే అతను వెళ్లిపోయాడు.తీరా బ్యాంకు దగ్గరికెళ్లాక బ్యాగ్ పోయిన విషయాన్ని గమనించి యజమానికి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వాళ్లు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. తొలుత షాపు దగ్గర ఉన్న సీసీకెమెరా ఫుటేజ్ ని పరిశీలించారు. బ్యాగ్ షాప్ దగ్గరే పడిపోయినట్టు గుర్తించారు. రోడ్డుపై పడిన ఆ బ్యాగ్ ఓ వ్యక్తి తీసుకోని వెళ్లిపోయాడు. ఇతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..డబ్బు స్వాధీనం చేసుకున్నారు.