vijaydevarkonda donated organs
mictv telugu

విజయ్ దేవరకొండ గొప్ప మనస్సు..అవయవాలు దానం

November 17, 2022

టాలీవుడ్ రౌడీ హీరో విజయదేవరకొండ తన మంచి మనస్సును చాటుకున్నాడు. తన అవయవాలను అన్నింటిని దానం చేయబోతున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పేస్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ‘చిన్నారుల్లో కాలేయ మార్పిడి ’పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశాడు. అవయవాలను దానం చేయాలన్న విజయదేవరకొండ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

‘‘ ఇతరుల కోసం అలా చాలా మంది తమ అవయవాలు దానం చేయడం చాలా గొప్ప విషయం. కానీ దక్షిణాది దేశాల్లో అవయవ దానం తక్కువగా ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. నేను నా అవయవాలు అన్నింటినీ దానం చేస్తున్నాను. మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు వృథా కాకూడదు. వేరొకరు జీవించడానికి ఉపయోగపడాలి’’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పాడు చేసుకుంటున్నామని.. ఏ చిన్న సమస్య వచ్చిన వైద్యులని సంప్రదించాలని విజయ్ సూచించాడు. దీంతో ‘రౌడీ’ నిజమైన హీరో అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

నిజానికి సమాజంలో అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరికొందరి ప్రాణాలను నిలబెడతాయి. చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు.

ఇక లైగర్ ప్లాప్‌తో జోరు తగ్గించిన విజయ్ దేవర్ కొండ ప్రస్తుతం ‘ఖుషీ‘ అనే మూవీలో నటిస్తున్నాడు. విజయ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంవత్సరం థియేటర్స్‌లోకి ఈ చిత్రం విడుదల కానుంది.