‘‘కాలుతోందా మీకు.. ’’ - MicTv.in - Telugu News
mictv telugu

‘‘కాలుతోందా మీకు.. ’’

August 29, 2017

’అర్జున్ రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ ఏమ్మాట్లాడినా, ఏం చేసినా సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినీరంగంలో తళుక్కుమని మెరిసిపోతున్న ఈ యువనటుడు ఘాటైన సరదా సంభాషణలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. తాజాగా అర్జున్ రెడ్డి చిత్రం ప్రచారంలో భాగంగా అమెరికాలోని ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన కామెంట్ కు విపరీతమైన స్పందన వస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమాను భారత్ లో ప్రీమియర్ షోలు అయిపోయాక అమెరికాలో విడుదల చేశారు. అక్కడి తెలుగు జనాన్ని ఆకట్టుకోవడానికి చిత్ర బృందం చిన్న వీడియోను తీసింది ఘాటు కుర్రాడితో. అందులో విజయ్.. ‘యూఎస్‌ఏ.. కాలుతోందా మీకు.. ఇండియాలో అల్‌రెడీ ప్రీమియర్స్ అయిపోయాయి. మీకంటే ముందే సినిమా చూశాం. నిర్వాణ ఫిల్మ్స్ అమెరికాలో 85 చోట్ల సినిమాను విడుదల చేసింది..’’ అని అన్నాడు.