వికారాబాద్‌లో దారుణం...  ఆవుపై కాల్పులు  - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్‌లో దారుణం…  ఆవుపై కాల్పులు 

October 24, 2020

Vikarabad cow incident .jp

వికారాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గురుతెలియను దుండగులు అణ్యం పుణ్యం ఎరుగని మూగజీవిపై తుపాకీతో కాల్పులు జరిపి ప్రాణం తీశారు. చనుగోముల పోలీస్ స్టేషన్ పరిధిలోని దామగుండంలో పొలాల్లో తిరుగుతున్న ఆవును కొందరు చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంఘటన స్థలంలో కలిపించిన తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణంపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బలితీసుకున్నారని అంటున్నారు. దీనికి బాధ్యులైవారిని వెంటనే శిక్షించి, పశువులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. అడవి జంతువులను వేటాడ్డానికి వచ్చిన దుండగులే ఆవును బలితీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.