బ్రేకింగ్.. మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అరెస్ట్

July 9, 2020

Vikas Dubey Arrest At Ujjain

కరుడుగట్టిన నేరగాడు.. 8 మంది పోలీసుల ప్రాణాలను తీసుకున్న వికాస్ దుబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఆలయానికి సమీపంలో తానే వికాస్ దుబే అంటూ గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అధికారులు రహస్య ప్రాంతానికి తరలించారు. నాలుగు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న దుబే పోలీసులకు చిక్కడంతో అతడి నేర  సామ్రాజ్యంపై విచారణ జరిపే అవకాశ కనిపిస్తోంది. 

చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి కలిగిన వికాస్ దుబే అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. సెటిల్ మెంట్లు, హత్యలు అనేకం చేశాడు. అతనిపై ఇప్పటికే 60 కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఓ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతడితో పాటు అనుచరులు కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో 8 మంది మరణించారు. దీంతో అప్పటి నుంచి 40 టాస్క్ ఫోర్స్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇద్దరు అనుచరులతో పాటు కాల్పుల్లో పాల్గొన్న వారిని ఇటీవల ఎన్‌కౌంటర్ చేశారు.

60 కేసుల్లో నిందితుడైన వికాస్ దూబే కోసం వందల మంది పోలీసులు వెతుకుతున్నా ఉజ్జయిని దేవాలయంలో గార్డుకు దొరకడం ఆసక్తిగా మారింది. ఎన్‌కౌంటర్ భయంతోనే అతడు లొంగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే కావాలనుకున్న దూబే గతంలో పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్బీవాత జేపీ మంత్రి సంతోష్ శుక్లాను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.