ఎన్‌కౌంటర్‌ కు వికాస్ అర్హుడే..రిచా దూబే - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్‌ కు వికాస్ అర్హుడే..రిచా దూబే

July 11, 2020

NV BNV

కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అతన్ని ఉజ్జయిని నుంచి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసలు కాన్పూర్‌కు తరలిస్తుండగా వారి వాహనం బోల్తా పడింది. అప్పుడు వికాస్ తప్పిచుకోవడానికి ప్రయత్నించగా..పోలీసులకు అతనికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 

పోలీసుల కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై అతని భార్య రిచా దుబే స్పందించారు. వికాస్‌ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె తెలిపారు. వికాస్‌ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని రిచా చెప్పారు. కాన్పూర్‌లోని భైరోఘాట్‌లో జరిగిన వికాస్‌ దుబే అంత్యక్రియల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్‌ తివారీ ఉన్నారు.