Vikram Gokhale's family refutes death news, shares he's still critical and is on life support
mictv telugu

సీనియర్ నటుడు చనిపోయాడని వార్తలు..ఖండించిన ఫ్యామిలీ

November 24, 2022

బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గోఖలే చనిపోలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం గోఖలే ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. వెంటిలేట‌ర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కోసం ప్రార్థించాలంటూ కుటుంబ సభ్యులు కోరారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల గోఖలే ప్రస్తుతం పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ, గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు ఆర్గాన్ ఫెయిల్యూర్ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.

అయితే చికిత్స తీసుకుంటూ కోమాలోకి వెళ్లి చనిపోయారని వార్త వైరల్ అయ్యింది. పలువురు బాలీవుడ్ హీరోలు సైతం సంతాపాలను వ్యక్తం చేస్తూ మెసేజ్‌లను పోస్ట్ చేయడంతో అందరూ నిజం అని నమ్మారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. రంగ‌స్థ‌ల న‌టుడిగా ప్రారంభ‌మైన ఆయ‌న ప్రయాణం త‌ర్వాత సినిమాల వైపు మ‌ళ్లింది. ప‌లు బాలీవుడ్ సినిమాల‌తో పాటు టీవీ సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించారు.