''అతడు'' సిన్మకి సీక్వెల్ కథ దొర్కినట్టే...! - MicTv.in - Telugu News
mictv telugu

”అతడు” సిన్మకి సీక్వెల్ కథ దొర్కినట్టే…!

August 2, 2017

అబబ్బ ఏం స్కెచ్చు ఏం స్కెచ్చు…ఇసొంటి స్కెచ్చులెయ్యాల్నంటే స్కెచ్చు పెన్నులే ఒడుస్తయ్ గనీ  మనసొంటోళ్లతోని గాదుళ్లా,సిన్మ నిర్మాతలకు ఈకథ జెప్తె ఎన్ని కోట్లు వెట్టైనా కథను కొన్కుంటరు గావచ్చు,కథ ,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ ఆఖర్కి హీరోగ గుడ ఆయన్నే తీస్కోవాలె,ఇంకెవ్వలు ఏలు వెట్టద్దు,ఆయనైతెనె ఒక్కో సీన్ ను రసవత్తరంగ పండిస్తడు,సిన్మగుడ సూపర్ హీట్టయితది.ఇంతకీ ఆయనెవరంటే ఇంకెవరు కాంగ్రెస్ మాజీమంత్రి కుమారుడు విక్రమ్ గౌడ్,గుండెగాళ్లు నన్ను కాల్శిపోయిన్రని రొండు బులెట్లు తల్గి  దవాఖాన్ల చేరిండుగదా,కనీ గీయ్న సిన్మ,డైరెక్షర్ ఏదో తేడా గొడ్తుందని పోలీసులు..అతడు సిన్మల ప్రకాశ్ రాజ్ లెక్క ఎంక్వైరీ మొదలు వెడితే అప్పుడు దొర్కింది ఈ కథల ఇంటర్వెల్ బ్యాంగు. ఈయ్నను గాల్శింది ఎవలో గుర్తుతెలియని వ్యక్తులు కాదట…

ఈ విక్రమ్ గౌడే ఇండోర్ నుంచి సుపారీ గ్యాంగును పిలిపిచ్చుకొని,నిపుణుడైన షూటర్ తోని కాల్పిచ్చుకుండట,లెక్కకైతె గీ కథ  ఆరునెల్లముందే పుట్టందట,హీరో అయిన విక్రమ్ గౌడ్ కి అప్పులెక్కువైనయట,తండ్రిచ్చిన ఇల్లును గుడ అమ్ముకున్నడట,ఇగ పైసలిచ్చినోళ్లు పీకలమీద కుసునేవరకు గీ కథకు శ్రీకారం సుట్టిండు విక్రమ్ గౌడ్.ఎన్ని రౌండ్లు కాల్వాలే, బాడీల ఏడ కాలిస్తే పానంబోదు,సిసి కెమ్రెరాలకు దొర్కకుంట ఎట్ల పారిపోవాలె,అన్నిటిని దగ్గరుండి విక్రమ్ గౌడే ప్లాన్ ఏశిండట.కనీ నిజం ఎన్నిరోజులని దాగుతది..తీగ లాగుతే డొంక బైటవడ్డట్టు…హీరో గారు అల్లిన కథను ఎంక్వైరీ జేస్కుంట వోతే  ఆయన హీరోగాదు అస్సలు విలన్ ఆయ్ననే అని తెల్శింది,ఇగేముంది ఈ కేసులో ఎ1నిందితునిగా విక్రమ్ గౌడ్, ఎ2 గా ఇండోర్  కు చెందిన షూటర్, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు మరో ముగ్గురు నిందితులపై 120,120 బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశిన్రు పోలీసులు.మరి హీరోగారు కోల్కున్నంక కథ ఏమన్న మల్పులు దిర్గుతదో లేక్పోతే అరెస్టు జైలు అనే క్లైమాక్స్ సీన్ తోని ఒడ్శిపోతదో సూడాలె.