కాల్చుకున్నాడా...కాల్చారా..? - MicTv.in - Telugu News
mictv telugu

 కాల్చుకున్నాడా…కాల్చారా..?

July 28, 2017

బులెట్లు రెండే..కానీ  జవాబు దొరకని ప్రశ్నలెన్నో,కాల్చుకున్నాడా? కాల్చారా? హత్యా యత్నమా? ఆత్మహత్యా ప్రయత్నమా?  విక్రమ్ గౌడ్ కు అప్పులున్నాయా? డ్రగ్స్  మాఫియాతో లింకంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం?ఇంతకీ వాట్సప్ లో చివరి సారిగా ఎవరికి మెసేజ్ పెట్టాడు?అప్పుల వాళ్లు ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడే  ఈ సంఘటన జరిగిందా ? ఇవి మా డౌట్స్ కాదు.. మీడియాలో,వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలన్నింటిని  ఒకదగ్గర కూర్చి మీకందిస్తున్న ప్రశ్నలు.

కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్  కు తగిలిన బుల్లెట్లు గాయాలు ఎన్నో ప్రశ్నలకు,ఎన్నో కొత్త మలుపులకు దారి తీసాయి,ఒకలేమో విక్రమ్ గౌడ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని ,చివరకు తండ్రి ఇచ్చిన ఇంటిని కూడా అమ్ముకున్నాడని,అప్పులు ఇచ్చిన ఫైనాన్సర్లు ఒత్తిడి పెంచారని  అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుంటే,మరికొందరు విక్రమ్ గౌడ్ కు డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు.

గత కొన్నిరోజులగా  డ్రగ్స్ కేసుపై జరుగుతున్న విచారణను ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు,తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అన్న భయంతో తనను తాను కాల్చుకున్నట్టు  చెబుతున్నారు…ఇక ఆమె భార్య చెప్పింది ఇంకోలా ఉంది గురువారం పొద్దున్నే శుభముహూర్తం  ఉందని గుడికి వెళ్దామనుకున్నాం,నేను పై ఫ్లోర్ రెడీ అవుతుంటే,కాల్పుల శబ్ధం విని కిందికి వచ్చే సరికి తన భర్త రక్తపు మడుగులో ఉన్నాడని చెబుతుంది, మరి ఇన్ని కథనాలలో ఏది నిజం,ఏది అబద్దం, పోలీసులు కేస్ ఫైల్ చేసి విచారణను మొదలు పెట్టారు,విక్రమ్ వాట్సప్ లో చాలా కీలకమైన ఆధారాలను సేకరించారట.ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ఏమీ మాట్లాడలేని పరిస్ధితి,పోలీసుల విచారణ పూర్తైతె కానీ నిజం ఏంటో తెలీదు.