రేప్ చేస్తే శిక్ష ఐదు గుంజీలే.. కానీ 8 తీశాడు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేస్తే శిక్ష ఐదు గుంజీలే.. కానీ 8 తీశాడు.. వీడియో వైరల్

November 26, 2022

బీహార్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని కేవలం ఐదు సార్లు గుంజీలు తీయించి వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అయి విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నవాడా జిల్లాలో నిందితుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, పంచాయితీ చేసిన పెద్ద మనుషులు నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు.

https://www.youtube.com/shorts/fOJqLq73AMA

అందరి సమక్షంలో ఐదు గుంజీలు తీయాలని ఆదేశించడంతో నిందితుడు అలాగే చేసి నేరం నుంచి తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న యువకులు దీన్ని ఫోన్లలో రికార్డు చేయడంతో వైరల్ అయింది. అయితే నిందితుడు 8 గుంజీలు తీయడం గమనార్హం. దీంతో స్పందించిన పోలీసులు నిందితుడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. అటు ఇంత చిన్న శిక్ష వేసిన పెద్దమనుషులను విచారిస్తున్నట్టు సమాచారం.