Village volunteer burns survey papers in AP
mictv telugu

గ్రామ వలంటీర్ ఆవేదన.. కాల్చి పారేశాడు

June 1, 2022

Village volunteer burns survey papers in AP

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరవేసే వాలంటీర్లు.. ప్రభుత్వం తమను సరిగా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. చాకిరీ ఎక్కువ.. ప్రతిఫలం తక్కువ అన్న చందంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలుకు చెందిన బాషా అనే వాలంటీర్ ప్రభుత్వం ఇచ్చిన సర్వే పత్రాలను దహనం చేశాడు.

గడప గడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమం కోసం అధికారులు వాలంటీర్లకు సర్వే పత్రాలను ఇచ్చారు. అధికారుల తీరును నిరసిస్తూ బాషా పై చర్యకు పాల్పడ్డాడు. అంతేకాక, పేపర్లు మంటల్లో కాలిపోతున్న దృష్యాలను వీడియో తీసి వారి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా సేవలు అందించామనీ, లబ్దిదారులను వెతికి మరీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. తాము చేసిన సేవలను గుర్తించకుండా తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డాడు.