బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

June 3, 2020

Village volunteer incident on girl

 కరోనా ఉన్నా కామాంధులు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా రెచ్చిపోతూనే మహిళల ఉసురు తీస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. బాలికపై కన్నేసిన గ్రామ వాలంటీర్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడి అత్యాచారం చేశాడు. శింగనముల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న సంతోష్ అదే ప్రాంతానికి చెందిన ఓ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బాలిక ఒక్కత్తే ఉంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లారని చెప్పింది. ఇదే అదనుగా భావించాడు ఆ రాక్షసుడు. అప్పటికే ఆమెపై కన్నేసిన సంతోష్.. ఇంక రెచ్చిపోయాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక అతన్ని ప్రతిఘటిస్తూ.. పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. వాళ్ల చేతికి చిక్కితే చచ్చినట్టే అని భావించిన సంతోష్ అక్కడినుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, రేప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా గుంటూరు జిల్లా దాచేపల్లిలో పంచాయతీ సెక్రటరీ జాన్‌ పీరా భార్య ఉండగానే.. మహిళా గ్రామ వలంటీర్‌తో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.  వలంటీర్‌కు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. దీంతో వాలంటీర్ సోదరుడు అశోక్ గ్రామ సెక్రటరీని నిలదీశాడు. ప్రశ్నించిన పాపానికి అశోక్‌పై సెక్రటరీ సోదరుడు కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.