బిడ్డ తల్లికి లవ్ లెటర్.. గ్రామ కీచకుడి నిర్వాకం - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డ తల్లికి లవ్ లెటర్.. గ్రామ కీచకుడి నిర్వాకం

August 4, 2020

Village Volunteer Love Letter to Women

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినా.. కొంత మంది మాత్రం దాన్ని అభాసుపాలు చేస్తున్నారు. తమదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. గ్రామంలో ప్రజలకు సేవలు వాలంటీర్ కామాంధుడిగా మారాడు.  పెళ్లైన ఓ బిడ్డ ఉన్న మహిళకు ప్రేమ లేఖలు రాసి ఇవ్వడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా  నార్పల మండలంలో ఇది జరిగింది. తరుచూ ప్రేమ పేరుతో తనను వాలంటీర్ వేధిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది.

ఉయ్యాలకుంట గ్రామంలో సుబ్రమణ్యం అనే గ్రామ వాలంటీర్ ఉన్నాడు. ఇటీవల అతని వద్దకు ఓ మహిళ కుల ధృవీకరణ పత్రం కోసం అతన్ని సంప్రదించింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. క్యాస్ట్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి అందులో ‘ఐ లవ్‌ యూ’ అంటూ రాసిన కాగితం చేతికి ఇచ్చాడు. అది తెరిచి చూసి తన భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో వెంటనే  ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అన్నా అని పిలిచినా కనీస సంస్కారం కూడా అతనికి లేదని బాధితురాలు వాపోయింది. కాగా గతంలోనూ ఓసారి ఇంగ్లీషులో రాసి ఇవ్వగా.. ఆమె అర్థం చేసుకోలేకపోవడంతో సోమవారం తెలుగులో రాసి ఇచ్చినట్టుగా బాధితురాలు చెబుతోంది. మహిళలను వేధించడానికే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారా అంటూ ఆమె కుటుంబ సభ్యులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.