ఇలాంటి ఊరును మీరు చూసి ఉండరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇలాంటి ఊరును మీరు చూసి ఉండరు..

May 23, 2022

ఊరు అనగానే కొన్ని ఇళ్లు, కొన్ని వీధులు, గుళ్లు, గోపురాలు, వాటర్ ట్యాంకులు వంటివి గుర్తుకొస్తాయి. ఎంత అభివృద్ధి చెందిన ఊరు అయినా దాన్నొక ఊరుగా పిలవాలంటే ఇళ్లు, రోడ్లు తప్పనిసరి. కానీ ఓ ఊరులో దీనికి మొత్తం ఉల్టా పల్టా. అక్కడ ఇళ్లు ఉంటాయి. వీధులు కూడా ఉంటాయి. కానీ అవి విడివిడిగా ఉండవు. ఇళ్లే వీధులు, వీధులే ఇళ్లు. అలా అని కప్పు లేకుండా రోడ్లపైన చెట్లకింద గుడిసెలేమో అనుకునేరు. కానే కాదు. చక్కగా కట్టిన ఇళ్లు ఉంటాయి. వీధులు కూడా ఉంటాయి. కానీ ఇళ్ల ముందు కాకుండా ఇళ్ల కప్పులపైన ఉంటాయి. ఇంటి కప్పులే వీధులు అన్నమాట. జనం ఇళ్ల కప్పుల మీదుగా తమ ఇళ్లకు వెళ్తారు. వారి ఇంటి కప్పులపైనా మరికొందరు అలాగే వెళ్తారు.

ఈ వింత ఊరు ఇరాన్‌లోని బక్తియారీ రాష్ట్రం మియాన్కహ్ ఏ మొగుయి జిల్లాలో ఉంది. పేరు సార్ అగా సెయిద్. 2006 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 208 ఇళ్లలో 1360 మంది నివసిస్తున్నారు. ఎక్కువ మంది లూర్ తెగవారు. దీన్ని చూడ్డానికి దేశీ, విదేశీ పర్యాటకుల వస్తుంటారు. కొండను ఆనుకుని కట్టుకున్న ఈ ఇళ్లకు తలుపులు, కిటికీలు ఉండవు.