Home > Featured > అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించిన యువత

అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించిన యువత

73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ అమర జవాను కుటుంబానికి కొత్త ఇంటిని కానుకగా ఇచ్చి యువత ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరానికి సమీపంలో ఉన్న బెట్మా గ్రామానికి చెందిన మోహన్ సింగ్ బీఎస్‌ఎఫ్ జవానుగా విధి నిర్వహిస్తూ 1992లో అమరుడయ్యాడు. అప్పటికే ఆయనది పేద కుటుంబ. గుడిసెలో నివసించేవారు. మోహన్ మృతిచెందేనాటికి ఆయనకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆయన భార్య గర్భిణి.

దీంతో కుటుంబ భారం ఆయన భార్యపై పడింది. ఆమె అదే గుడిసెలో తన పిల్లలతో జీవిస్తూ కాలం వెళ్లదీస్తోంది. కానీ కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గుడిసె పైకప్పు ధ్వంసమైంది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మోహన్ కుటుంబ పరిస్థితిని చూసిన గ్రామ యువత మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఓ ఇల్లు కట్టించి కానుకగా ఇచ్చింది. ఇందుకోసం గ్రామ యువత ఒక చెక్కు-ఒక సంతకం అనే కార్యక్రమానికి చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.11 లక్షలు సేకరించి.. రూ.10 లక్షలతో మోహన్ కుటుంబానికి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈ సందర్భంగా యువత అందరికీ ఆమె రాఖీలు కట్టి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన లక్షతో మోహన్ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించాలని యువత నిర్ణయించింది.

Updated : 16 Aug 2019 4:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top