ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

October 24, 2019

Balakrishna....

టీడీపీ నేత,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. లేపాక్షి – హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి ఏడాది కావస్తున్నా ఇంకా పనులు పూర్తికాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.

టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆయన హిందూపురానికి వెళ్లారు. విషయం తెలిసిన గలిబిపల్లి ప్రజలు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గ్రామస్థులకు నచ్చజెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. అక్కడి నుంచి ఆయన నేరుగా వివాహానికి హాజరయ్యారు. కాగా నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకొని స్వాగతం పలికారు.