ఏపీ : మద్యం అమ్మవద్దన్నందుకు వ్యక్తి గ్రామ బహిష్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : మద్యం అమ్మవద్దన్నందుకు వ్యక్తి గ్రామ బహిష్కరణ

May 31, 2022

ఆంధ్రప్రదేశ్ శ్రీ బాలాజీ జిల్లా ఏర్పేడు మండలం కొత్త వీరాపురంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం వద్దని చెప్పి విక్రయాలను అడ్డుకున్న ముని కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు సోమవారం గ్రామంలో ఆ మేరకు దండోరా వేయించారు. అయితే బహిష్కరణ వేటుపై బాధితుడు ముని కృష్ణారెడ్డి ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాగా, ఆరోగ్యానికి హానికరమైన మద్యాన్ని అడ్డుకున్నందుకు బహిష్కరించడంపై చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యావంతులు, అభ్యుదయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.