కిరాణా అటేన్షన్.. గీత దాటితే ఖబడ్దార్..  - MicTv.in - Telugu News
mictv telugu

కిరాణా అటేన్షన్.. గీత దాటితే ఖబడ్దార్.. 

March 24, 2020

Villagers chasing Corona as soldiers .. No entry into village

కరోన వైరస్ సోకకుండా ఉండాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నా జనాలు రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. కరోనాను సులువుగా తీసుకోకండి.. మీ నిర్లక్ష్యం ఇంకొంతమందికి ప్రమాదాన్ని కొని తెస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినా వినకుండా రోడ్లపైకి వస్తున్నవారికి లాఠీతో బుద్ధి చెబుతున్నారు. వారం రోజులు జైలు శిక్ష కూడా విధిస్తామని కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఇలాంటి మొండి జనాలు ఒక్కసారి ఆందోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రజల ముందజాగ్రత్తగా తీసుకుంటున్న చర్యలను చూసి నేర్చుకోవాల్సిందే. ‘ఎవరో వచ్చి తమకు చెప్పడం ఎందుకూ.. కరోనా ఎంత దుర్మార్గురాలో మాకు తెలుసు. మేమే మేలుకుంటాం, మా గ్రామాన్ని ఆ మహమ్మారి బారినుంచి కాపాడుకుంటాం..’ అన్నట్టు గ్రామస్థులు అందరూ ఒక్క తాటిమీద ఉన్నారు.  

తమ గ్రామాల్లోకి వేరే వ్యక్తులు ఎవరు రాకుండా.. గ్రామాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా తామే స్వయంగా రోడ్లను బ్లాక్ చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వస్తున్నవారి కోసం క్రమపద్ధతిలో ఒకరికొకరికి మధ్య దూరాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు దుకాణాల ముందు జనాలు మనిషికి మనిషికి మధ్య మీటరు దూరం ఉండేలా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. యజమానులు తమ షాపుల ముగ్గుతో మీటరు వ్యవధిలో డబ్బాలు, గుండ్రాలు గీశారు. వెళ్లినవారు వాటిలో నిల్చిని సరుకులు తీసుకోవాలి.