వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా పోతుందా.? - MicTv.in - Telugu News
mictv telugu

వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా పోతుందా.?

March 24, 2020

Neem Tree

కరోనా ప్రపంచం అంతా ఈ పేరు వింటేనే వణికిపోతుంది. ఎక్కడ దీని భారిన పడతామో అని జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్‌ను కట్టి చేసేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. ఇదే సమయంలో గ్రామాల్లో ఓ మూఢ విశ్వాసం దావాణంలా వ్యాపించింది. తల్లులు తమ బిడ్డల కోసం వేపచెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదనే వదంతులు రావడంతో జనం నీళ్లు పట్టుకొని పరుగులు పెడుతున్నారు. ఎవరికీ వారు నీళ్లు పోస్తూ, కొబ్బరికాయలు కొడుతూ వైరస్ నుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ ప్రచారం జరిగింది. ఐదు వేర్వేరు భావుల నీరు సేకరించి వేప చెట్టుకు పోయాలి. ఎంత మంది కొడుకులు ఉంటే అన్ని కొబ్బరికాయలు కొట్టాలనే ప్రాచారం జరిగింది. దీంతో  కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇలా పూజలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నమ్మకంపై జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు స్పందించారు. ఇలాంటి మూఢనమ్మకాలతో వైరస్‌ను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంటికే పరిమితమైతే మంచిదని హెచ్చరిస్తున్నారు. 

కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభలిన ఈ మహమ్మారికి ఇంకా ఏ దేశం మందు కనుగొనలేదు. ప్రజలు అనవసరంగా తప్పుడు మాటలు పట్టుకోవద్దని సూచిస్తున్నారు. కాగా దీని వ్యాక్సిన్ కోసం ఇంకా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే ఒక అంచనా మాత్రం వేస్తున్నారు.