Villagers who conducted scanning for crocodile in uttarakhand
mictv telugu

బాలుడిని లాక్కెళ్లిన మొసలి.. కోపంతో ఎక్స్‌రే తీయించిన గ్రామస్థులు

July 4, 2022

Villagers who conducted scanning for crocodile in uttarakhand

ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుుకుంది. సన్ పహార్ అనే గ్రామంలో నదిని దాటుతున్న 13 ఏళ్ల బాలుడిని మొసలి నీటిలోకి లాక్కెళ్లిపోయింది. దాంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమివ్వగా, వారు అటవీశాఖకు కబురుపంపారు. దాంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు గ్రామస్థుల సహాయంతో బాలుడిని లాక్కెళ్లిన మొసలిని బంధించారు.

 

dd

తర్వాత అదే ఊపులో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మొసలికి స్కానింగ్ నిర్వహించగా, కడుపు మొత్తం ఖాళీగా ఉందని తేలింది. దాంతో నదిలో పలు మొసళ్లు ఉన్నాయని, లాక్కెళ్లిన మొసలి కాకుండా మరో మొసలి బాలుడిని మింగేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాలుడి కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాలుడి మృతదేహం కోసం వెతుకులాట కొనసాగిస్తామని వెల్లడించారు.

crocodile