విలన్ గా మరో హీరో - MicTv.in - Telugu News
mictv telugu

విలన్ గా మరో హీరో

August 25, 2017

బాలీవుడ్ లో ఒక హీరో విలన్ గా కనిపించబోతున్నాడు. 1992 లో వచ్చిన ‘ బల్వాన్ ’ సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన అతను 2015 లో వచ్చిన ‘ 2 చెహ్రే ’ వరకు ఎంతో విజయవంతంగా సాగించాడు సినీ ప్రయాణం. అతనే సునీల్ శెట్టి. 24 శుక్రవారం రిలీజ్ అవుతున్న ‘ ఎ జెంటిల్ మేన్ ’ సినిమాలో అతను పూర్తి నిడివి విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇన్ని రోజులు హీరోగా అలరించిన సునీల్ శెట్టిలోని డిఫరెంట్ యాంగిల్ ఇది. పోస్టర్ మీద అతని లుక్స్ చాలా ఎక్స్ ట్రార్డనరీగా వున్నాయి. సిద్ధార్థ మల్హోత్రా, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ణ డికె, రాజ్ నిడిమోరు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి విలన్ గా నటించనుండటం చాలా ఇంట్రెస్టింట్ గా మారింది. తన కూతురు అతియా శెట్టి ఆల్ రెడీ రెండు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొడుకును కూడా త్వరలోనే హీరోగా తెరకు పరిచయం చేసే పనిలో వున్నాడు సునీల్ శెట్టి.

పోస్టర్ మీద అతని లుక్స్ చాలా ఎక్స్ ట్రార్డనరీగా వున్నాయి. సిద్ధార్థ మల్హోత్రా, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ణ డికె, రాజ్ నిడిమోరు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి విలన్ గా నటించనుండటం చాలా ఇంట్రెస్టింట్ గా మారింది. తన కూతురు అతియా శెట్టి ఆల్ రెడీ రెండు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొడుకును కూడా త్వరలోనే హీరోగా తెరకు పరిచయం చేసే పనిలో వున్నాడు సునీల్ శెట్టి.

 

హీరోలు విలన్లుగా మారడమన్నది ఇప్పుడు ఒక న్యూ కల్చర్ లా మారింది. అక్షయ్ కుమార్ కూడా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ 2.0 ’ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఆ సినిమా జనవరి 2018 లో రిలీజ్ అవుతోంది. తెలుగు హీరో సుధీర్ బాబు కూడా బాలీవుడ్ లో ‘ బాగీ ’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. రోజా, బొంబాయి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అరవింద్ స్వామి కూడా ‘ధ్రువ ’ సినిమాలో విలన్ గా చేసాడు. అలాగే సుమన్ సైతం ‘ శివాజీ ’ సినిమాలో విలన్ గా చేసాడు. అలాగే జగపతి బాబు, జెడి. చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు విలన్లుగా తెర మీద తమ సత్తా చాటారు. విలన్ రోల్ అన్నది ఒక డిఫరెంటు వే. పర్ ఫార్మెన్సులో హీరో కన్నా ఎక్కువగా విలన్ కే చెయ్యటానికి స్కోప్ వుంటుంది. అందుకే ఇప్పడిప్పుడే కొంత మంది హీరోలు నెగెటివ్ రోల్స్ చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ దారిలోకి ఎంట్రీ ఇస్తున్న సునీల్ శెట్టికి ఆల్ ది బెస్ట్ చెబుదామా.

అలాగే సుమన్ సైతం ‘ శివాజీ ’ సినిమాలో విలన్ గా చేసాడు. అలాగే జగపతి బాబు, జెడి. చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు విలన్లుగా తెర మీద తమ సత్తా చాటారు. విలన్ రోల్ అన్నది ఒక డిఫరెంటు వే. పర్ ఫార్మెన్సులో హీరో కన్నా ఎక్కువగా విలన్ కే చెయ్యటానికి స్కోప్ వుంటుంది. అందుకే ఇప్పడిప్పుడే కొంత మంది హీరోలు నెగెటివ్ రోల్స్ చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ దారిలోకి ఎంట్రీ ఇస్తున్న సునీల్ శెట్టికి ఆల్ ది బెస్ట్ చెబుదామా.