సన్నాఫ్ వినోద్ ఖన్నా ! - MicTv.in - Telugu News
mictv telugu

సన్నాఫ్ వినోద్ ఖన్నా !

June 22, 2017

దివంగత హీరో వినోద్ ఖన్నా చిన్న కొడుకు సాక్షి ఖన్నా సినిమాల్లోకి రావడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో సాక్షి ఖన్నా డెబ్యూట్ హీరోగా రానున్నాడంట. వినోద్ ఖన్నా బతికున్నప్పుడే భన్సాలీని కలిసి తన ద్శకత్వంలో సాక్షిని ఇంట్రడ్యూస్ చెయ్యాలని చెప్పాడట. పెద్దాయనకిచ్చిన మాట కోసం ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరలోనే సెట్స్ పైకి తీస్కెళ్ళే పనిలో పడ్డాడు భన్సాలీ.
ఇంతకు ముందే వినోద్ ఖన్నా పెద్ద కొడుకు అక్షయ్ ఖన్నా హీరోగా చాలా సినిమాలే చేసాడు గానీ ఎందుకో స్టార్ డమ్ ను సంపాదించుకోలేక పోయాడనే ఫికర్ తండ్రికుండేది. తన చిన్న కొడుకు అలా అవడానికి వీల్లేదనుకున్నాడేమో.. అందుకే చిన్న కొడుకును మంచి డైరెక్టర్ చేతిలో వెయ్యాలని తపించి పాపం చూడకుండానే వెళ్ళిపోయాడు వినోద్ ఖన్నా.