యునైటెడ్ కింగడమ్ మాంచెస్టర్ లోని బోల్డన్ లో వయోలిన్, మానవ వనరుల నిపుణురాలు సునీతా ఖౌండ్ భూయాన్ ‘షీ ఇన్ స్పైర్స్ గ్లోబల్ కల్చర్ ఛాంపియన్’ అవార్డును అందుకున్నారు.
మన ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు, అవార్డులు అందుకున్నప్పుడు, అది ఎల్లప్పుడూ దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. సృజనాత్మకత, శ్రేయస్సు, నాయకత్వం కోసం సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఆమెకు తగిన అవార్డు లభించింది. ఈ అవార్డులు ఈమె కొత్త కాదు సంగీతంలో ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును అందుకున్నది. క్లాసికల్ మ్యూజిక్ అనే కాదు.. ఫోక్, జాజ్, మెలోడీలను తన వయొలిన్ తో ఎంతో బాగా వినిపించగలదు.
షీ ఇన్ స్పైర్స్ అవార్డుల ఎనిమిదవ సంవత్సరం వేడుకలు జరిగాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఇది మూడవ సారి మాత్రమే మన దేశం తరుపున ఒకరు వెళ్లడం. డెన్మార్క్, భారతదేశం, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, మలేషియా, శ్రీలంక, స్పెయిన్, దోహా, జర్మనీ, టర్కీ వంటి దేశాల నుంచి అలాగే యూకే నలుమూలల నుంచి ఎంట్రీలు వచ్చాయి. ’17 విభాగాల్లో చాలా నామినేషన్లు వచ్చాయి. అందులో 187మంది ఫైనలిస్ట్ గా చేశాం. న్యాయనిర్ణేతలకు సెలెక్ట్ చేయడం చాలా కష్టం అయింది.
సునీత ఈ అవార్డు గెలువడం చాలా సంతోషంగా ఉంది’ అంటున్నారు గుల్నాజ్ బ్రెన్నాన్ వ్యవస్థాపకుడు ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ అవార్డు కార్యక్రమంలో భూయాన్ గ్లోబ్ లో భారతీయ రాయబారిగా సేవలందించే తత్వానికి అనుగుణంగా హెచ్ఎమ్ క్వీన్ ఎలిజబెత్ II కోసం సంగీత ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు.. దివంగత రాణికి అంత్యక్రియలు జరిగిన రోజున భూయాన్ ఆమె కుమారుడు రోనోజిత్ తో కలిసి భారత హై కమిషన్ తరుపున నెహ్రూ సెంటర్ లండన్ లో కూడా ప్రదర్శన ఇచ్చారు.