తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

July 17, 2019

VIP break darshan will be abolished TTD to High Court....

కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆలయ దర్శనంలో కీలక మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయించారు. 

అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విరామ సమయాల్లో అమలు చేస్తున్న ఎల్‌-1,ఎల్‌-2,ఎల్‌-3 విధానంలో లోపాలను ఆసరాగా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్‌ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని అన్నారు. ఈరోజు నుంచే ఎల్‌-1,ఎల్‌-2,ఎల్‌-3 విధానాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు.