బండి రిజిస్ట్రేషన్ కోసం నంబర్ ప్లేట్ తీసుకోవడం మామూలే. కానీ కొందరికి ఫ్యాన్సీ నంబర్లు, కలిసొచ్చే నంబర్లు ఉంటాయి. వాటి కోసం ఎంతయినా ఖర్చు చేస్తారు. అలా ఒక నెంబర్ కోసం ఏకంగా 1, 12, 15, 500 రూపాయలు పలికింది. నచ్చిన బండి కొనడమే కాదు.. దానికి మనకు నచ్చిన నంబర్లను తీసుకోవడం కూడా ఒక పెద్ద ప్రహసనమే. అలాంటిది హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగింది. మామూలుగా అయితే ఈ రిజిస్ట్రేషన్ కోసం వెయ్యి రూపాయలను కట్టించుకుంటారు. కానీ ఆ నంబర్ కోసం చాలామంది బిడ్ చేశారు. దీంతో దాని ధర ఆకాశానికి చేరుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని రిజిస్టరింగ్, లైసెన్సింగ్ అథారిటీ కోట్ ఖాయ్ ద్వారా HP 99-9999 నంబర్ ప్లేట్ కోసం బిడ్ స్వీకరించారు. బిడ్డింగ్ ప్రారంభమైన నంబర్ ప్లేట్ వేలం వేశారు. దీని కోసం 26మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. రూ1,12,15,500 విన్నింగ్ బెడ్ అయ్యే వరకు ధరను పెంచారు. అయితే ఈ నంబర్ ఎవరు గెలుచుకున్నారనేది మాత్రం తెలియరాలేదు.
HP 99-9999 లైసెన్స్ ప్లేట్ బహుశా స్కూటర్ కోసం అయి ఉండవచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. కోవిడ్ తర్వాత వెహికిల్స్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గేర్ లెస్ స్కూటర్స్ మీద మక్కువ ఎక్కువ చూపుతున్నారు. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. రాష్ట్ర చరిత్రలో టూ వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఇంత పెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలియచేశారు.