శశి జైలువిలాసం.. - MicTv.in - Telugu News
mictv telugu

శశి జైలువిలాసం..

August 21, 2017

అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయలలిత నెచ్చెలి శశికళకు రాజభోగాలు అబ్బుతున్నాయని వస్తున్న ఆరోపణలకు గట్టి ఆధారాలే లభిస్తున్నాయి. ఆమెను జైలు సిబ్బంది వీఐపీలా చూసుకుంటున్న వీడియో ఒకటి బయటికి పొక్కింది.

జైల్లో రాజభోగాలంటే సాధారణంగా మంచి భోజనం, బయటి నుంచి బిర్యానీ వగైరా పార్సిళ్లు, ఫోన్లు, బట్టలు వంటివి అనుకుంటాం. శశిని గౌరవంతో కాపలా కాస్తున్న సిబ్బంది మాత్రం మరింత తెగించి ఆమెను  ఏవో రాచకార్యాల కోసం బయటికి కూడా పంపుతున్నట్లు  ఈ వీడియోలో ఉంది. ముదురు రంగు పంజాబీ డ్రస్సులో ఉన్న శశమ్మ షాపింగ్ బ్యాగ్ తీసుకుని దర్జాగా జైలు బయటి నుంచి జైల్లోపలికి వస్తుండగా ఈ వీడియో తీశారు.

శశి జైలు విలాసాల గురించి తొలిసారి బయటపెట్టిన పోలీసు అధికారిని రూప ఈ ఫుటేజీలను బయటికి తెచ్చారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది.