వివాహానికి వచ్చిన వాళ్లు బహుమతులు ఇవ్వడం మామూలే. వధువు, వరుడు ఒకరికొకరు ఊహించని బహుమతి ఇచ్చి ఆశ్చర్యపోతుంటారు. ఒక వరుడు.. వధువుకు ఊహించని బహుమతి ఇచ్చి అందరి చేత మెప్పు పొందాడు.
పెండ్లి అంటే మెహందీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ బిజీ ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్స్ లో కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటే ఆ కిక్కే వేరు. అది కూడా యూనిక్ గా ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఊహించని ప్రదర్శన ఇచ్చిన ఒక వరుడు.. వధువుకు ఇచ్చిన బహుమతి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
వరుణ్ జర్సానియా అనే కళాకారుడు తన ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన వధువు కోసం అద్భుతమైన కాన్వాస్ పెయింటింగ్ ను అది కూడా తన కళ్ల ముందే వేసి చూపించాడు. స్వతహాగా వరుణ్ మంచి కళాకారుడు. ఈ వీడియోలో.. బ్యాక్ గ్రౌండ్ లో ‘గర్ల్స్ లైక్ యూ..’ అంటూ పాట ప్లే అవుతుంది. ఆ పాటకు వరుడు లిప్ సింక్ చేస్తూ డ్యాన్స్ చేశాడు. అంతేకాదు.. మధ్య మధ్యలో కాన్వాస్ దగ్గరకు వెళ్లి వధువు బొమ్మ గీశాడు. బొమ్మ కోసం నల్లని పెయింట్ ఎంచుకున్నాడు.
పెయింటింగ్ పెళ్లి వేడుకకు హాజరైన అందరి ముందు చిత్రించాడు. అలాగే మధ్య మధ్యలో వధువు ప్రతీ చర్యను క్యాప్చర్ చేశారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. వధువు బొమ్మను కాన్వాస్ మీద తలకిందులుగా గీయడం. చివర క్షణంలో తిప్పి చూస్తే వధువు ముఖచిత్రం కనిపిస్తుంది. మొత్తం పూర్తయ్యాక అందరి రియాక్షన్ ఒక్కటే ‘వావ్’. ఈ వీడియోకి వరుణ్ ‘వధువు కోసం డ్యాన్స్ చేయడం చాలా సాదరమైంది.
అందుకే కొద్దిగా కొత్తగా చేయాలని అనుకున్నా. వధువు పై నా ప్రేమను చూపించాలనుకున్నా’ అంటూ క్యాప్షన్ రాశాడు. ఈ వీడియోకి ఇప్పటికే 1.2 మిలియన్ల వ్యూస్, 200కే లైకులు వచ్చాయి. ఇక కామెంట్లకు అయితే లెక్కలేదు. చాలామంది ‘ఈ రోజు కోసం అతను ఎంత కష్టపడ్డాడో’ అంటూ కామెంటారు. మొత్తానికి ఈ పెయింటింగ్ అందరి మనసులను దోచేస్తున్నది.
ఇవి కూడా చదవండి :
ముగ్గురు భార్యలతో 5 క్రికెట్ టీంలు రెడీ చేసిన పాకిస్తానీ
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు