ఓ స్త్రీ రేపురా! కొన్ని దశాబ్దాల కిందట తెలుగు ఊళ్లలో ప్రతి ఇంటి గుమ్మం పక్కన ఎర్రగా తాటికాయంత అక్షరాలతో ఈ రాత కనిపించేది. ఇలా రాయడానికి ఓ భయమే కారణం. ఎవరో బిచ్చగత్తె ఇంటికి వస్తుందని, ఆమెకు బిచ్చం వేసినవాళ్లు చనిపోతారని ఆ భయం. ఇప్పుడలాంటి రాతలు లేవు. కాకపోతే భయాలు మాత్రం మరో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి.
యూపీలోని రాంపూర్ పట్టణంలో ఇలాంటి వ్యవహరమొకటి సాగుతోంది. జనం రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఇంటి కాలింగ్ బెల్లు కొడుతున్నారు. ఇంత రాత్రివేళ ఎవరు వచ్చారబ్బా అని తలుపు తెరిచి చూసినవాళ్లు గుండెదడతో పడిపోతున్నారు. గుమ్మంలో ఓ స్త్రీ నగ్నంగా కనిపించడం, వెర్రెత్తినట్లు నవ్వడమే దీనికి కారణం. ఈ సంగతి తెలిసినవాళ్లు బెల్లు మోగితే చాలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
ఆమె దెయ్యమని భయపడుతున్నారు. అయితే ఇది సీసీకెమెరాల కాలం కావడంతో బండారం బయటపడింది. బెల్లు కొడుతూ ఠారెత్తున్న మనిషి ఓ పిచ్చావిడ అని పోలీసులు తేల్చారు. ఆమె మానసిక స్థిమితం లేక దిగంబరంగా తిరుగుతూ బెల్లు కొడుతోందని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాత్రిపూట బయటికి రాకుండా ఇంట్లోనే ఉంచాలని ఆమె తల్లిదండ్రులకు చెప్పామని వివరించారు.
ఇవి కూడా చదవండి :
ఈ దేశం 95 మిలియన్ల ఉచిత కండోమ్ లను పంపిణీ చేస్తున్నది!
గ్రహాంతర వాసి అని చావగొట్టారు కానీ..