సోషల్ మీడియా పుణ్యామా అని ఎక్కడా ఏం జరిగిన నిమిషాల్లో వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా దేవునికి సంబంధించిన అంశాలు ఈ మధ్య ఎక్కువ కనబడుతున్నాయి. అమ్మవారు కళ్లు తెరవడం, ఎలుగు బంటలు ఆలయంలో గంట కొట్టడం వంటివి లను ప్రజలు కంట పడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన మరోసారి వెలుగు చూసింది. విషయం పాతదే అయినా కొత్త ప్రదేశంలో జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణాలో నంది విగ్రహం పాలు తాగడం స్థానిక ప్రజలను ఆశ్చర్యపస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణంలోని పాత మార్కెట్ లోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో ఓ నంది విగ్రహం పాలు తాగుతుంది. భక్తులు చెంచాలతో పాలు పట్టిస్తుంటే అలా లోపలికి పోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం ఆనోట ఈనోట పాకడంతో ఈ వింతను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంతా దేవుని మహిమ అంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గతంలో కూడా వేప నుంచి పాలు కారడం, వినాయకుడు పాలు తాగడం, సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలడం వంటి ఘటనలు దర్శమిచ్చాయి.
వైరల్ వార్తలు :
బుర్జ్ ఖలీఫాను వర్షం నుంచి కాపాడే గొడుగు!
చైనాలో ఇండియన్ మందులకు భారీ డిమాండ్..
మంచు తుఫాన్ ఎఫెక్ట్.. గడ్డకట్టిన నయాగరా జలపాతం