Viral News : rat bites 8-year-old at McDonald's Hyderabad
mictv telugu

Viral News : ఎలుక కొరికిందని పోలీసులకు ఫిర్యాదు

March 11, 2023

Viral News :  rat bites 8-year-old at McDonald's Hyderabad

ఫ్యామిలీతో సరదాగా గడుపుదామని రెస్టారెంట్‏కు వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్‏కు చేదు అనుభవం ఎదురైంది. వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తింటుండగా ఒక్కసారిగా ఎలుక వచ్చిన తన కుమారుడిని కొరికింది. 8 ఏళ్ల బాలుడు గట్టిగా అరవడంతో ఆందోళనకు గురైన తండ్రి వెంటనే ఎలుకను తీసి పక్కకు పాడేసి కుమారుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఓ రెస్టారెంట్‏లో ఈ ఘటన జరిగింది. ఇంత జరుగుతున్నా రెస్టారెంట్ యాజమాన్యం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో సీరియస్ అయిన ఆర్మీ ఆఫీసర్ సదరు రెస్టారెంట్‏పై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని సదరు ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చిన ఎలుక తన కుమారుడి షార్ట్ లోకి దూరి తొడ పై భాగంలో గట్టిగా కొరికిందని, ఎలుక పంటి గాట్లు పెట్టిన ఫోటోలను ఫిర్యాదుతో పాటు జతచేశారు. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీ ఆఫీసర్ డిమాండ్ చేశారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం 8 ఏళ్ల బాబుకు యాంటీ రేబిస్, టీకాలకు ఇప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సదరు రెస్టారెంట్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.