Thai Man Gets Marriage Certificate Tattooed On His Arm To Surprise Wife
mictv telugu

పెండ్లి సర్టిఫికెట్ టాటూగా వేయించుకున్నాడు!

February 17, 2023

ప్రేమను ప్రదర్శించాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు. ఒక వ్యక్తి తమ పెండ్లి సర్టిఫికెట్ టాటూగా వేయించుకొని తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెండ్లి మనిషిని మార్చగలదని అంటారు. థాయ్ లాండ్ కి చెందిన ఒక వ్యక్తి వాలెంటైన్స్ డే సందర్భంగా వారి వివాహాన్ని పురస్కరించుకొని పచ్చబొట్టు వేయించుకోవాలనుకున్నాడు. తద్వారా తన భార్యపై తన ప్రేమను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రేమ వ్యక్తం..

థాయ్ కి చెందిన ఒక వ్యక్తి టాటూ వేయించుకోవడానికి టాటూ పార్లక్ వెళ్లాడు. అక్కడ వారు కొన్ని టాటూలను చూపించారు. ఏవీ తనకు నచ్చలేదు. కాస్త యూనిక్ గా ఉండాలని అనుకున్నాడు. అందుకోసం చాలా రోజులు ఆలోచించాడు. చివరకు తన వివాహ సర్టిఫికెట్ టాటూగా వేయించుకోవాలనుకున్నాడు. అందులోని అక్షరాలే కాదు.. చుట్టూ ఉన్న పూల డిజైన్ ని కూడా వదలకుండా టాటూగా వేయించుకున్నాడు. గంటలు వేచి ఉన్న తర్వాత తను అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ ఫోటోలను ఆ టాటూ పార్లర్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వైరల్ గా..

థాయ్ వ్యక్తి సరబురి ప్రావిన్స్ లోని కెంగ్ ఖోయ్ లోని టాటూ ఆర్టిస్ట్ స్టూడియోలో ఎనిమిది గంటలకు పైగా కూర్చొని టాటూ వేయించుకున్నడు. అయితే ఇలాంటి టాటూ ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదని పార్లర్ వాళ్లు కూడా చెబుతున్నారు. దీనికోసం ముందుగా సాధారణ సిరాతో ముందుగా చేతిపై సర్టిఫికెట్ ను కాపీ చేసుకున్నాడు. తర్వాత టాటూ గన్ తో పువ్వులను, స్టాంప్ లను కచ్చితమైన రంగులతో నింపేశాడు. ఈ ఫోటోలను చూసిన వారంత ‘వావ్’ అంటూ పొగిడేస్తున్నారు. అతని భార్య మాత్రం ముందు షాక్ కి గురయింది. ఆ తర్వాత భర్త ప్రేమ చూసి మురిసిపోతున్నది.