Viral News : Uttarakhand Govt Spent 3 Lakh Rupees For One Student
mictv telugu

ఈ విద్యార్థి కోసం నెలకు రూ.3లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

December 26, 2022

మిగతా స్కూళ్లతో పోలిస్తే గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కాస్త తక్కువ ఉంటుదన్న సంగతి తెలిసిందే. కానీ ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఒక విద్యార్థిని ఉండగా… టీచర్లు మాత్రం ముగ్గురు ఉన్నారు. ఆమెకు ముగ్గురు టీచర్లు చదువు చెబుతున్నారు. ఆ విద్యార్థినికి మధ్యాహ్న భోజనం సైతం అందిస్తున్నారు. తెహ్రీ జిల్లా, తాలుల్దార్ బ్లాక్లోని మార్గావ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ హైస్కూల్లో ఈ పరిస్థితి నెలకొంది.

ఈ గ్రామానికి 2006లో గవర్నమెంట్ స్కూల్ మంజూరు కాగా.. అప్పటి నుంచి 2014 వరకు పంచాయతీ భవన్లో స్కూల్ నడిపించారు. 2014లో స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ కట్టించారు. అప్పుడు స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 23. అప్పటి నుంచి వరుసగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2021లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది ఒక్క బాలికే మిగిలింది. ప్రస్తుతం ఓ మహిళా టీచర్ సహా ముగ్గురు టీచర్లు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు ఓ వంటమనిషి సైతం ఇక్కడ పనిచేస్తున్నారు.

అడవి మధ్యలో ఈ స్కూల్ ఉందని, ఇక్కడి రావడానికి చాలా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ రాకేశ్ చంద్ డోభాల్ తెలిపారు. వణ్యప్రాణులు సైతం తిరుగుతుంటాయని చెప్పారు. అందుకే చాలా మంది గ్రామస్థులు.. పట్టణాలకు వలస వెళ్లారని తెలిపారు. కాగా, ఆ బాలిక కోసం విద్యాశాఖ నెలకు రూ.3లక్షలు వ్యయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైరల్ వార్తలు : 

బాబోయ్ మంచు….చలి

రెండో పెళ్లి చేసుకున్న వారికి ఈ హోటల్‌లో స్పెషల్ డిస్కౌంట్