Viral Photo: Father-Son Duo's 'Jab We Met' Moment Crossing Paths As Railways Staff
mictv telugu

వైరల్ అవుతున్న అద్భుతమైన సెల్ఫీ.. స్పెషాలిటీ ఇదే..

June 16, 2022

Viral Photo: Father-Son Duo's 'Jab We Met' Moment Crossing Paths As Railways Staff

రెండు రైళ్లలో విధుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. అయితే ఇందులో పెద్ద వింతేమీ ఉందని అనుకోవచ్చు. ఫోటోలో ఉన్న ఆ ఇద్దరు తండ్రీకొడుకులు. వారిలో ఒకరు రైల్వేలో ట్రావెల్‌ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా పని చేస్తున్నారు. మరొకరు రైల్వేలోనే గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా, కొడుకు ట్రావెల్ టిక్కెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వారు పనిచేస్తున్న రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా ఈ సెల్ఫీమూమెంట్‌ను తీసుకున్నారు. సెల్ఫీలో ఇద్దరూ యూనిఫాం ధరించి ఉన్నారు. సురేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘అద్భుతమైన సెల్ఫీ’ అని దానికి శీర్షిక పెట్టాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది, తండ్రీ, కుమారుల పేర్లను ఆయన పేర్కొనలేదు. అద్భుతమైన సెల్ఫీ, తండ్రీ కొడుకుల ప్రేమ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్‌కి 28,000 కంటే ఎక్కువ లైక్‌లు 1,700కి పైగా రీ-ట్వీట్లు వచ్చాయి.