పుడుతూనే డాక్టర్ మాస్క్ పీకేసిన బుడ్డోడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పుడుతూనే డాక్టర్ మాస్క్ పీకేసిన బుడ్డోడు..

October 15, 2020

Viral Photo of Newborn Baby Pulling Mask Off Doctor's Face

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. అయితే త్వరలో ప్రజలు మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయని తెలిపారు యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్. అంటే కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే పొరబడినట్లే. డాక్టర్‌ సమీర్‌ చీబ్ ఉద్దేశ్యం వేరు. ఇటీవల డాక్టర్‌ సమీర్‌ చీబ్ తన ఆసుపత్రిలో ఓ మహిళకు డెలివరీ చేశాడు. 

అప్పుడు పుట్టిన శిశువును డాక్టర్ చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ శిశువు డాక్టర్‌ సమీర్‌ చీబ్ ధరించిన మాస్క్‌ను తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచం మాస్కును తొలగించే రోజు త్వరలో వస్తుందని, ఈ విషయం ఆ పాప సింబాలిక్‌గా చెప్పిందని డాక్టర్ అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను డాక్టర్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ”త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా” అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాప పుణ్యమాని మాస్కులు తొలగించే రోజులు త్వరలో రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.