మీ ముఖాలు ‘మండిపోను’, ఇదేం ప్రీవెడ్డింగ్‌రా బాబూ.. - MicTv.in - Telugu News
mictv telugu

మీ ముఖాలు ‘మండిపోను’, ఇదేం ప్రీవెడ్డింగ్‌రా బాబూ..

May 13, 2022

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే అందమైన పూలతోటలు, సముద్ర తీరాలు, ఎత్తైన కొండల్లో కాబోయే వధూవరులు ఫోటోస్ దిగుతారని మనకు ఇప్పటివరకు తెలుసు. కానీ తాజాగా ఓ వధూవరులు చేసిన ఫోటోషూట్ చూస్తే షాక్ అవ్వక మానరు. చేతుల్లో పూలు, పళ్లకు బదులు ఏకంగా వారికి వారే నిప్పంటించుకుని పరిగెత్తారు. ఈ విచిత్రమై ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Times Now (@timesnow)


ఫేమస్ వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ అయిన రస్ పావెల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో వధూవరులు ఇద్దరూ మండుతున్న పూల బోకే, ఆ వెంటనే మంటలు అంటుకొని పరుగెత్తుతుండడం కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఫోటోగ్రాఫర్ వారి ఫోటోస్ తీశాడు.. కాస్త దూరం పరిగెత్తిన తర్వాత ఇద్దరు నెలపై పడిపోవడం.. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి మంటలను ఆర్పేశారు.

ఈ ఫోటో షూట్ నిపుణుల పర్యవేక్షణలో జరిగిందని.. వారి శరీరాలకు యాంటీ బర్న్ జెల్ ఉందని..అలాగే వధువు జుట్టు పై విగ్ అమర్చినట్లు రస్ పావెల్ చెప్పుకోచ్చాడు.. వధూవరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఈ స్టంట్ ఎవరు ప్రయత్నించవద్దని తెలిపాడు.. ప్రస్తుతం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.