ఇదెక్కడి ఆచారం.. పాముదండలు మార్చుకున్న కొత్తజంట - MicTv.in - Telugu News
mictv telugu

ఇదెక్కడి ఆచారం.. పాముదండలు మార్చుకున్న కొత్తజంట

May 30, 2022

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ కొత్త జంట తమ పెళ్లి వేడుకను మిగతావారికి భిన్నంగా జరుపుకుంది. ఆ వధూవరులు పూల దండలకు బదులుగా ప్రాణాంతకమైన పాము దండలను మార్చుకున్నారు. ఇది ఆ గ్రామ ఆచారమట. ముందుగా వధువు వరుడి మెడలో ఓ నాగు పామును వేసింది. ఆ పాము మెడలో ఉండగానే జంట ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చింది. వరుడి వంతు రాగానే పెద్ద కొండచిలువను తీసుకొచ్చి వధువు మెడలో వేశాడు. గ్రామస్తుల అందరి సమక్షంలోనే ఈ తతంగం జరిగింది. అలా పామును మెడలో వేసినప్పటికీ వధూవరులు కొంచెం కూడా భయపడలేదు. కాగా వారిద్దరూ స్థానిక వన్యప్రాణి విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biharii)

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆచారం, సంప్రదాయం సంగతి ఏమో కానీ.. ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ పాములకు వధూవరులు వన్యప్రాణి విభాగంలోని పనిచేస్తున్నారని తెలుసా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇది పాత వీడియోనే అయినప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.