Viral Video: Bull Scares Off A Tiger, Internet Stunned
mictv telugu

పెద్దపులిని పరుగులు పెట్టించిన ఎద్దు.. వీడియో వైరల్

September 1, 2022

అడవిలోని జంతువులు ఆహారం కోసం ఒకదానిని ఒకటి వేటాడుతుంటాయి. వన్యప్రాణులకు వేటకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చాలా వైరలవుతుంటాయి. అయితే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) సుశాంత నంద తాజాగా ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో మాత్రం కాస్త వెరైటీగా ఉంది. అడవిలో పెద్ద పులిని భయపెట్టిన ఎద్దు వీడియోను సుశాంత్ షేర్ చేశారు. పులిని భయపెట్టిన ఎద్దు క్యాప్షన్ తో ట్విట్టరులో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పులినే భయపెట్టిన ఎద్దు వీడియో చూసి నెటిజన్లు కూడా షాకయ్యారు.

ఓ ఎద్దు దాని మానాన అది పరుగెత్తుకెళుతుంది. ఇంతలో రోడ్డు పక్కన దాక్కున్న పులి ఎద్దుని చూసి దాని మీదకు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. తర్వాత ఎద్దు వెళ్లిపోయాక పులి దాని దారిలో అది వెళ్లిపోయింది. అదే సమయంలో రోడ్డు మధ్యలో పులిని చూసిన ఒక వాహనం డ్రైవరు వ్యాన్ ను ఆపివేస్తాడు. ఈ వైరల్ వీడియోను 18,600 కంటే ఎక్కువ మంది నెటిజన్లు వీక్షించారు. మరో 900 కంటే ఎక్కువ మంది నెటిజన్లు లైక్‌ చేశారు. వందలాది మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను రీట్వీట్ చేశారు.ఈ వీడియోను ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.