సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజస్థాన్ లో జరిగిన ఘటన ఇది. ఓ యువకుడు చిల్లర నాణేలతో ఐఫోన్ కోసం యాపిల్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ తన వద్ద ఉన్న చిల్లరంతా పోసి మొబైల్ బిల్లు ఎంతుందో అంత లెక్కపెట్టి తీసుకుని మిగతాది ఇచ్చేయమంటాడు. దీంతో సదరు వ్యాపారికి చిర్రెత్తిపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఎఫ్ఐఆర్ వరకు వెళ్లింది. అయితే చివర్లో యువకుడు తాను ఈ పని ఎందుకు చేశానో చెప్తూ ట్విస్ట్ తో ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదంతా రికార్డు చేసి వీడియోను షేర్ చేయడంతో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అమిత్ శర్మ అనే యువకుడు ఐఫోన్ కోసం యాపిల్ స్టోర్ కి వెళ్తాడు. మొబైల్ సెలెక్ట్ చేసిన తర్వాత బిల్లు చెల్లించమని దుకాణాదారు అడగ్గా, పాలిథీన్ సంచులు, టబ్బుల్లో ఉన్న చిల్లరంతా పోసి లెక్కపెట్టుకోమని దురుసుగా జవాబిచ్చాడు. మొత్తం లక్షన్నర వరకు ఉందని, అందులో మొబైల్ బిల్లు రూ. 84 వేలను మీరే లెక్కబెట్టుకొని మిగతా డబ్బు తనకివ్వమని చెప్పడంతో వ్యాపారి సహనం కోల్పోయాడు. ఇన్ని నాణేలను ఎవరు లెక్కిస్తారని ఆగ్రహించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. క్రమంగా గొడవ పెరిగి పోలీస్ స్టేఫన్ వరకు వెళ్లింది. చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమస్యను పరిష్కరించేంత వరకు వెళ్లి సద్దుమణిగింది. ఆఖరుకి అమిత్ శర్మ ఆన్ లైన్లో బిల్లు చెల్లించి బయటపడ్డాడు. అయితే ఇదంతా రికార్డు చేసి తన యూట్యూబ్ ఛానెల్ క్రేజీ xyzలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. మూడు రోజుల్లోనే 46 లక్షల వ్యూస్ వచ్చాయి. ఫన్నీ కోసం వీడియో తీసినా రియలిస్టిగ్ గా ఉండడంతో వ్యూయర్స్ ని ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి :
సెకన్లలో చీర కట్టిన సిక్కు సేల్స్ మెన్!
సిరిసిల్ల షాలిని కిడ్నాప్ స్టోరీ.. సినిమాను తలపించే ట్విస్టులతో పూర్తి కథనం