Viral Video: Drunk Man Enjoys in Floodwater Amid Mumbai Rains,
mictv telugu

వీడెవండి బాబు.. నడిరోడ్డుపై బురదనీటిలో ఏంటా పని!

July 8, 2022

Viral Video: Drunk Man Enjoys in Floodwater Amid Mumbai Rains,

వర్షాలతో రోడ్లన్ని జలమయ్యాయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఓ వైపు ట్రాఫిక్ జామ్.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షపు జల్లు.. వీటన్నంటి మధ్య నడిరోడ్డుపై నీళ్లలోనే పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడో వ్యక్తి. మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో జరిగిందీ సంఘటన. పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి.. నడిరోడ్డు మీద బురదలో పడుకున్నాడు. అదేదో స్విమ్మింగ్ పూల్ లో పడుకుంటున్నట్లు అటు ఇటు బోర్లుతున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల వలన నీళ్లు అతని ఒంటిమీద పడుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా అలాగే పడుకుని ఉన్నాడు.

గౌరవ్ కదమ్ అనే వ్యక్తి.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ఆ రోడ్డుపై బస్సుల్లో వెళ్తున్న వారంతా .. ఆ వ్యక్తికి ఏమైందోనని ఆశ్చర్యపోయారు. సినిమాలో హీరోయిన్లు నటించినట్లు బురద నీటిలో ఏంటా పని అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తాగుబోతుల స్విమ్మింగ్ పూల్ ఇదేనని అంటున్నారు. మోతాదుకు మించి మద్యం తాగితే ఇలానే అవుతుందని మరో కొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.