Viral Video: Elephant and Mahout Brave Through Swollen Ganga River in Bihar’s Vaishali. Watch
mictv telugu

రియల్ బాహుబలి.. వరదలో 3 కి.మీ ఈదిన ఏనుగు, మావటి

July 13, 2022

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక సముద్ర తీరప్రాంత రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఆ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్‌లో కూడా వరద లాంటి పరిస్థితి కనిపించింది. రాఘవపూర్ సమీపంలోని గంగానది ఉప్పొంగింది. ఆ నదిలో ఓ ఏనుగు, దాని మావటి వరద నీటిని దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

గంగానదిలో ఆ ఏనుగును దాటించాలంటే పెద్ద పడవ అవసరం పడింది. అంత డబ్బు లేకపోవడంతో ఈదుతూ నదిని దాటించాలని మావటి ప్రయత్నించాడు. ఆ నీటిలో ఏనుగు దాదాపు పూర్తిగా మునిగిపోయినట్లు కనిపిస్తోంది. ఆ ఏనుగును సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మావటి బలమైన అలల మధ్య దాని చెవిని పట్టుకొని దానిపై కూర్చున్నాడు. మావటితో కలసి ఆ ఏనుగు గంగానది గుండా ఏకంగా మూడు కిలోమీటర్లు ఈదుకుంటూ ధైర్యంగా మరియు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న నది యొక్క ఒక మూలకు చేరుకోవడం వీడియోలో కనిపించింది.