గుజరాత్‌లో నోట్ల వర్షం కురిసింది. రూ.10,20,100 నోట్లు కాదు ఏకంగా రూ.500 నోట్లు పైనుంచి వచ్చి పడ్డాయి. బలిసి ఉన్న ఓ కుటుంబ ఈ నోట్ల వర్షం కురిపించింది. ఇక వాటిని ఏరుకునేందుకు జనం భారీగా ఎగబడ్డారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలో ఓ వివాహం జరిగింది. డీ తాలూకాలోని గ్రామం మాజీ సర్పంచ్ కరీంభాయి దాదుభాయి జాదవ్ మేనల్లుడు వివాహాన్ని ఘనంగా జరిపారు. వారి కుటుంబలో రజక్ ఒక్కడే మగ సంతానం కావడంతో పెళ్లిని వైభవంగా నిర్వహించారు. ఈ పెళ్లి సందర్భంగా ఇంటి పైనుంచి కుటుంబ సభ్యులు రూ.500 నోట్ల వర్షం కురిపించారు. భారీగా డబ్బులను గాల్లోకి వెదజల్లారు. దీంతో స్థానికులు నోట్లను అందుకునేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో ఒకరిని ఒకరు తోసుకోవడం వీడియోలో కనిపిస్తోంది.
Former sarpanch showers cash at wedding event in Gujarat’s Mehsana.
A former sarpanch of a village in Gujarat’s Mehsana showered money on people gathered to witness his nephew’s wedding celebrations.
pic.twitter.com/BjkeZgKW67— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) February 19, 2023
ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి కూడా కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. బ్యాగ్ నిండుగా రూ.10 నోట్లు తెచ్చిన ఆ వ్యక్తి కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్ పైనుంచి డబ్బులను గాల్లోకి ఎగరేశాడు. ఆ నోట్లను తీసేందుకు ప్రజలు భారీగా రావడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అతడు ఓ వీడియో కోసం ఇలా చేసినట్లు తెలిసింది.