ఎండ ఎక్కువ కొట్టినా.. వర్షం ఎక్కువ పడినా చేతిలో గొడుగు ఉండి తీరాల్సిందే! మనుషులే గొడుగు పట్టాలా? పెద్ద భవంతులకూ ఆ గొడుగును రక్షణను కల్పించలేమా? అని ఆలోచించారు. అదిగో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
ఏ భవనం అయినా ఎండలో ఎండి, వర్షంలో తడువాల్సిందే! కానీ వాటికి గొడుగులు పెడితే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎడతెరిపి లేని వర్షాలకు ఈ గొడుగు ఆ భవనాలకు రక్షణగా నిలుస్తుందని ఒక వీడియో చెబుతున్నది. దుబాయ్ లాంటి మహానగరాల్లో ఆకాశహార్మ్యాలు ఎక్కువ. దుబాయ్ లో మంగళవారం తెల్లవారుజామున నుంచి వర్షం పడుతూనే ఉంది. మేఘావృతమైన ఆకాశం, నీటితో నిండిన రోడ్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ సందర్భంలో.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం ఇన్ స్టాలో వర్షపు వాతావరణాన్ని స్వాగతించే యానిమేటెడ్ వీడియో క్లిప్ ను పంచుకున్నారు. ఈ క్లిప్ లో బుర్జ్ ఖలీఫా మధ్యలో తెరుచుకోవడం కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన భవనాన్ని వర్షం నుంచి రక్షించడానికి ఒక పెద్ద గొడుగు కనిపిస్తుంది. ఇది చూడడానికి నిజమైతే బాగుండు అనిపించేలా ఉంది కదాఔ
వీడియో బుర్జ్ ఖలీఫా దుబాయ్ డెస్టినేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో కూడిన ఒక పెద్ద గొడుగుతో ఉన్న కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్‌ని చూపుతుంది. ఇది @faz3 మై దుబాయ్ అనే యూజర్ నేమ్ తో ఈ వీడియోని 15.1 మిలియన్ ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఈ వీడియోకు ఇప్పటికే ఏడున్నర లక్షల లైక్స్ వచ్చాయి. కామెంట్స్ అయితే బోలెడు వచ్చాయి. అందరూ నగరం పట్ల వారి ప్రేమను తెలియచేశారు. యూఏఈలో మరికొన్ని రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండబోతున్నదని వాతావరణ శాఖ తెలియచేసింది. అస్థిర వాతావరణ పరిస్థితుల్లో వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి :
స్వర్గం నుంచి వచ్చిన అమృతం కాఫీ
చైనాలో ఇండియన్ మందులకు భారీ డిమాండ్..